వివేకా హత్యతో నాకు సంబంధంలేదు..

వివేకా హత్యతో నాకు సంబంధంలేదు..

సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు... వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవించిన సుధాకర్ రెడ్డి.. అసలు వివేకా హత్య విషయమే నాకు నిన్న సాయంత్రం 5 గంటలకు తెలిసిందన్నారు. వైఎస్ వివేకా హత్యలో సుధాకర్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తం కాగా... ఆయనతో ప్రత్యేకంగా కలిశారు ఎన్టీవీ ప్రతినిధులు... ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నించారు. అయితే, వైఎస్ రాజారెడ్డి హత్య కేసులోనూ నన్ను అన్యాయంగా ఇరికించారని ఆయన వాపోయారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసిన సుధాకర్ రెడ్డి... నన్ను పులివెందుల పోలీసులు.. పీఎస్‌కు పిలిచి ఐదు నిమిషాల్లోనే ఇంటికి పంపించారని తెలిపారు.