కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సుధీర్ బాబు

కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సుధీర్ బాబు

యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.`వి` చిత్రానికి మిశ్రమ స్పందనలు రాగా సుధీర్ బాబు కాప్ రోల్ కి పేరొచ్చింది. ఈ సినిమా లో సుధీర్ బాబు యాక్టింగ్ కు అభిమానులు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజా సమాచారం ప్రకారం సుధీర్ బాబు పలాస దర్శకుడు కరుణ కుమార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. శ్రీకాకుళం బార్డర్ `పలాస` నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించాడు కరుణ కుమార్. ఆతర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. తాజాగా సుధీర్ బాబు సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి సంబందించిన ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ . రేపు (30న ) సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రీ లుక్ పోస్టర్ తోనే మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు 'పలాస' డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు.ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్  సంగీతం అందించనున్నారు .