వేరే డేట్ చూసుకున్న సుధీర్ బాబు !

వేరే డేట్ చూసుకున్న సుధీర్ బాబు !

ఇటీవలే 'సమ్మోహనం' చిత్రంతో మంచి హిట్ అందుకున్న హీరో సుధీర్ బాబు స్వయంగా నిర్మించి, నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'.  కొత్త డైరెక్టయర్ ఆర్ఎస్ నాయుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.  ముందుగా ఈ సినిమాను ఈ నెల 13న విడుదలచేయాలని అనుకున్నారు. 

కానీ అదే రోజున 'శైలజారెడ్డి అల్లుడు'తో నాగ చైతన్య, 'యు టర్న్' సినిమాతో సమంత థియేటర్లలోకి రానుండటంతో సుధీర్ బాబు అనవసరమైన పోటీ నుండి తప్పుకుని సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురావాలని నిర్ణయించుకున్నారట.