మహేష్ తో కలిసి నటించాలనుకుంటున్న హీరో !

మహేష్ తో కలిసి నటించాలనుకుంటున్న హీరో !

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించాలని ఉందని ఇప్పటికే పలువురు హీరోలు తమ మనసులో మాట బయటపెట్టగా తాజాగా ఆయన బంధువు, హీరో సుధీర్ బాబు కూడ మహేష్ తో కలిసి స్క్రీన్ పై కనిపిస్తే బాగుంటుందని అన్నారు. 

వచ్చే నెల 13న ఆయన కొత్త చిత్రం 'నన్ను దోచుకుందువటే' రిలీజ్ సందర్బంగా ఆయన ఈరోజు శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు.  సతీసమేతంగా ఆలయ దర్శనానికి వచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు సుధీర్ బాబు, హీరోయిన్ నభా నటేష్ కు స్వాగతం పలికారు.  బ్యాడ్మింటన్ నేపధ్యంలో తెలుగు , హిందీ భాషల్లో పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేస్తున్న సంగతిని కూడా సుధీర్ బాబు ఈ సందర్బంగా వెల్లడించారు.