సుధీర్ బాబు అప్పుడే రానున్నాడు

సుధీర్ బాబు అప్పుడే రానున్నాడు

యువ హీరో సుధీర్ బాబు గత నెలలో సమ్మోహనం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే చేసిన మరో సినిమా 'నన్ను దోచుకుందువటే'. నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. ఇది వరకే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 

ఇక ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ఇవాళే చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఆటిట్యూడ్ కలిగిన మేనేజర్ గా కనిపిస్తుండగా, నాబా నటేష్ హీరోయిన్ గా నటించింది. మొన్నొచ్చిన టీజర్ లో యువతకు నచ్చే అంశాలతో పాటు కొత్త దనం ఉండటంతో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సుధీర్ బాబు తన సొంత బ్యానర్ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పై నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా పాటలను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లోకి వెళ్లనున్నారు.