టీఆర్ఎస్‌ అభ్యర్థి విద్యాసాగర్‌రావుకు రైతుల షాక్

టీఆర్ఎస్‌ అభ్యర్థి విద్యాసాగర్‌రావుకు రైతుల షాక్

ఓవైపు తమ ఓటు టీఆర్ఎస్ అభ్యర్థికే అంటూ కొన్ని చోట్ల ఏకగ్రీవ తీర్మానాలు జరుగుతుంటే... మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు చేదుఅనుభవం ఎదురవుతోంది. ఇవాళ మెట్‌పల్లి వేంపేటలో ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన కోరుట్ల తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అడ్డుకున్న చెరకు రైతులు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీపై విద్యాసాగర్‌రావును నిలదీశారు రైతులు. మూతపడ్డ చెరకు ఫ్యాక్టరీపై ఖచ్చితమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, చెరకు రైతులు మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.