ఎంట్రీ ఇవ్వక ముందే... హీట్ పెంచుతోంది..!! 

ఎంట్రీ ఇవ్వక ముందే... హీట్ పెంచుతోంది..!! 

బాలీవుడ్లో హీరోల కూతుర్లు హీరోయిన్లుగా వచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.  ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు ఇలా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, స్టార్ ప్రొడ్యూసర్ భట్ కూతురు అలియా భట్ ఇలా ఎందరో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించారు.  వీరితో పాటు జాన్వీ కపూర్, అహనా పాండే, తారా సుతారియా వంటి యువ నటీమణులు వరసగా సినిమాలు చేస్తున్నారు.  

ఈ బాటలో ఇప్పుడు బాలీవుడ్ బాద్షా కూతురు సుహానా అలీ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.  ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులే కన్ఫర్మ్ చేశారు.  సినిమాలోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఈ స్టార్ కూతురు వెబ్ సీరీస్ లో నటిస్తూ ప్రాక్టీస్ చేస్తోందట.  ఇదిలా ఉంటె, ఈ అమ్మడు, ఎంట్రీకి ముందే ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకుంటోంది.  తాజాగా బ్లాక్ డ్రెస్ లో ఉండే ఫోటోను షేర్ చేసి హీట్ పెంచింది సుహానా అలీ ఖాన్.