గాంధీభవన్ ముందు ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు మృతి

గాంధీభవన్ ముందు ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు మృతి

హైదరాబాద్ గాంధీభవన్ ముందు ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు మృతి చెందాడు. నిన్న ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే కౌలు రైతు పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అక్కడున్నవారు గమనించి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించాడు. గాంధీభవన్ ముందు ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. ఘటనస్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. 

సరైన పంటదిగుబడి, నీటి సరఫరా లేదు. వ్యవసాయానికి పెట్టుబడి లేక అప్పులు చేశాను. వాటి వడ్డీలు పెరిగి రూ.9లక్షల వరకు చేరాయి. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాను. దయచేసి నా కుటుంబాన్ని మీరే ఆదుకోవాలంటూ సూసైడ్ నోట్ లో రాశాడు.