నల్లగొండ ఉదయసముద్రం ప్రాజెక్టు వద్ద కలకలం

నల్లగొండ ఉదయసముద్రం ప్రాజెక్టు వద్ద కలకలం

నల్లగొండ పట్ణణంలోని ఉదయసముద్రం ప్రాజెక్టు వద్ద కలకలం రేగింది. ప్రాజెక్టు కట్టపై ఒక బ్యాగ్ తోపాటు సూసైడ్ లెటర్ లభించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సూసైడ్ లెటర్ ఆధారంగా ఇద్దరు కాలేజీ విద్యార్ధినిలు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమన్ గల్ కు చెందిన అభిఉన్నిసా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు కు చెందిన శ్రావణి అనే ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాల కోసం పోలీసులు ఉదయ సముద్రం ప్రాజెక్టులో వెతుకుతున్నారు.