సాహో యూనిట్ తోనే మళ్ళీ సుజిత్ ..!!? 

సాహో యూనిట్ తోనే మళ్ళీ సుజిత్ ..!!? 

సుజిత్ దర్శకత్వం వహించింది రెండు సినిమాలే.  అందులో మొదటి సినిమా శర్వానంద్ హీరోగా చేసిన రన్ రాజా రన్ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సుజిత్ దర్శకత్వంపై అందరికి గురి కుదిరింది.  సాహో వంటి భారీ ప్రాజెక్ట్ ను సుజిత్ చేతుల్లో పెట్టారు.  సుజిత్ ఈ ప్రాజెక్ట్ ను ఛాలెంజ్ గా తీసుకొని ప్రభాస్ తో సినిమా తీశాడు.  

కానీ, ఈ సినిమా సౌత్ లో ఫెయిల్ అయ్యింది.  బాలీవుడ్ లో మాత్రం భారీ హిట్టయింది.  దాదాపు రూ. 450 కోట్లు కలెక్ట్ చేసినా.. నష్టాలను చవిచూడాల్సి వచ్చింది  ఈ సినిమా పరాజయం తరువాత సుజిత్ తో సినిమా అంటే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.  కానీ, యూవీ క్రియేషన్స్ మాత్రం సుజిత్ తో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది.  సుజిత్.. శర్వానంద్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇవ్వబోతున్నారు.