జానారెడ్డిని చూస్తే బాధేస్తోంది..

జానారెడ్డిని చూస్తే బాధేస్తోంది..

తెలంగాణలో కాంగ్రెస్‌కు 30 మంది సీఎం అభ్యర్థులున్నారని టీఆర్‌ఎస్‌ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ నల్గొండలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే సీఎం అభ్యర్థులు నలుగురున్నారన్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అయోమయంలో పడ్డారని.. ఆయణ్ను చూస్తే బాధేస్తోందని అన్నారు. ఈసారి కూడా టీఆర్‌ఎస్‌దే విజయమని.. కాంగ్రెస్‌కు మరోసారి ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు.