సుకుమార్ ఈ ఏడాది చాలా బిజీ..!!

సుకుమార్ ఈ ఏడాది చాలా బిజీ..!!

రంగస్థలం తరువాత సుకుమార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నది.  సమ్మర్ తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.  మహేష్ బాబు సినిమాతో పాటు సుకుమార్ మరో మూడు సినిమాలు కూడా చేస్తున్నారు.  కాకపోతే డైరెక్టర్ గా కాదు.  నిర్మాతగా.  

సుకుమార్ నిర్మాతగా మారి చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాను సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.  ఏడి బుచ్చిబాబు దర్శకుడు.  ఈ సినిమాతో పాటు ఈ ఏడాది నాగశౌర్య, నితిన్ సినిమాలకు సుకుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు.  తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ లకు అవకాశాలు కల్పించేందుకు సుకుమార్ సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.