ప్రభాస్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడో..!!

ప్రభాస్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడో..!!

ప్రభాస్.. ఇప్పుడు జాతీయ స్థాయిలో స్టార్ రేటింగ్ ఉన్న హీరో.  బాహుబలి తరువాత ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.  ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో సాహో చేస్తున్నాడు.  భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే, జిల్ దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.  

ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు ప్రభాస్ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.  రంగస్థలం తరువాత సుకుమార్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. మహేష్ మహర్షి సినిమా పూర్తయిన తరువాత సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.  మహేష్ తో సినిమా పూర్తయ్యే సరికి ఎలాగో 2019 లేదంటే 2020 వస్తుంది.  మహేష్ సినిమా పూర్తయ్యాక ప్రభాస్ సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటాడు.  మరి ప్రభాస్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  బాహుబలి ఒకటైప్ సినిమానైతే, రాబోయే సాహో యాక్షన్ త్రిల్లర్ గా వస్తున్నది.  జిల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్నది.  సుకుమార్ ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి.