మహేష్ నో చెప్పినా సుకుమార్ మార్చలేదట !

మహేష్ నో చెప్పినా సుకుమార్ మార్చలేదట !

దర్శకుడు సుకుమార్ 'రంగస్థలం' తరవాత మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నారు.  ఈ మేరకు కథను కూడా సిద్ధం చేసుకుని మహేష్ బాబుకు వినిపించారు.  కానీ సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే రస్టిక్ స్టోరీ చెప్పడంతో మహేష్ వేరే కథను చెప్పమన్నారట.  దీంతో సుకుమార్ ఆ కథను తీసుకెళ్లి అల్లు అర్జున్ కు వినిపించారు.  వెంటనే బన్నీ ఆ కథకు ఓకే చెప్పి సినిమాను సెట్ చేసుకున్నాడు.  మహేష్ నో చెప్పినా కూడా సుకుమార్ కథలో మార్పులేవీ చేయలేదట.  మహేష్ బాబుకి చెప్పిన కథే బన్నీకి చెప్పాడట.  ఇక్కడ తేడా ఏమిటంటే మహేష్ బాబుకి నచ్చకపోవడం, బన్నీకి నచ్చడం.