జిగేలు రాణి సింగర్ కు న్యాయం చేసిన సుకుమార్ !

జిగేలు రాణి సింగర్ కు న్యాయం చేసిన సుకుమార్ !

సుకుమార్, రామ్ చరణ్ ల 'రంగస్థలం' చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో  ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  అలాగే ఈ సినిమాలోని పాటలు కూడ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపాయి.  వాటిలో ప్రత్యేక గీతం 'జిగేలు రాణి' ఒకటి.  ఈ పాటను విశాఖపట్నంకు చెందిన బుర్రకథ కళాకారిణి గంటా వెంకట లక్ష్మి ఆలపించారు. 

అయితే ఈ పాట పాడినందుకుగాను తనకు ఎలాంటి పారితోషకం ముట్టలేదని, సొంత ఖర్చులతో చెన్నై వెళ్లి సాంగ్ రికార్డింగ్ లో పాల్గొన్నానని, మధ్యలో ఉండే ఏజెంట్ తనకు పారితోషకం రాకుండా మోసం చేశారని మీడియాతో అన్నారు.  దీనిపై స్పందించిన దర్శకుడు సుకుమార్ వెంకటలక్ష్మికి లక్ష రూపాయల చెక్ ను అందజేశారు.  సుకుమార్ గారు వెంటనే స్పందించి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వడంపై వెంకట లక్ష్మి సంతోషాన్ని వ్యక్తం చేశారు.