మహేష్ స్టోరీతో విజయ్ సినిమా..!!

మహేష్ స్టోరీతో విజయ్ సినిమా..!!

రంగస్థలం తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సుకుమార్ ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.  ఇందుకోసం ఓ కథను రెడీ చేసి వినిపించాడు కూడా.  తెలంగాణ రజాకార్ల ఉద్యమకారుడు కథ అది.  ఆ స్టోరీపై మహేష్ పెద్దగా ఆసక్తి చూపలేదట.  మరో స్టోరీని ట్రై చేయమని చెప్పడంతో ఆ పనిలో ఉన్నాడు సుకుమార్.  

ఇదిలా ఉంటె, మహేష్ బాబు వద్దు అని చెప్పిన ఆ కథతో సుకుమార్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం.  విజయ్ దేవరకొండ తెలంగాణ నుంచి వచ్చిన హీరో.  ఆ  సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి విజయ్ తో సినిమా చేద్దామని సుకుమార్ అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  మహేష్ ప్రస్తుతం మహర్షి చేస్తున్నాడు.  ఆ సినిమా ఏప్రిల్ 5 న రిలీజ్ అవుతుంది.  సో, సినిమా రిలీజ్ అయ్యాక మరో నెల ఖచ్చితంగా గ్యాప్ ఉంటుంది.  ఎలా లేదన్న జూన్ వరకు మహేష్ సిద్ధంగా ఉంటాడు.  ఈ మధ్యలో ఏడెనిమి నెలలు గ్యాప్ ఉన్నది.  

ఈ గ్యాప్ లో తెలంగాణ రజాకార్ యోధుని కథను విజయ్ తో తెరకెక్కించాలని సుకుమార్ అనుకుంటున్నాడట.  ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలి.