టీజర్ రెడీ చేస్తున్న సుకుమార్..?

టీజర్ రెడీ చేస్తున్న సుకుమార్..?

స్టైలిష్ స్టార్ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందుతున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్నీ తెగ కష్టపడుతున్నారు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా సుకుమార్ ఈ సినిమా టీజర్ పనులు కూడా ప్రారంభించారంట. ఈ నెల చివరి వరకు కనీసం నాలుగు టీజర్ కట్స్ రెడీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా టీజర్‌ను బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అందుకే సుకుమార్ టీజర్ విషయంలో త్వరపడుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ నెల చివరికి సిద్దం చేసిన నాలుగు క్లిప్స్‌ను చూసి బన్నీ, సుకుమార్ విడుదల చేసే టీజర్‌ను ఫైనల్ చేస్తారంట. అంతేకాకుండా ఈ సినిమా నుంచి వస్తున్న మొదటి అతిపెద్ద అప్‌డేట్ టీజర్ కాబట్టి ఈ విషయంలో అన్ని సరిగ్గా ఉండాలని సుకుమార్ చూస్తున్నారంట. ఈ టీజర్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.