చైనాను ఢీకొట్టబోతున్న సుల్తాన్

చైనాను ఢీకొట్టబోతున్న సుల్తాన్

హాలీవుడ్ కు అతి పెద్ద మార్కెట్ చైనా.  చైనాలో హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి.  ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలకు కూడా అక్కడ మంచి ఆదరణ లభిస్తున్నది.  అమీర్ ఖాన్ దంగల్ సినిమా చైనాలో సూపర్ హిట్ అయింది. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.  కాగా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాను చైనాలో రిలీజ్ చేస్తున్నారు.  కుస్తీ పోటీలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది.  బాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సుల్తాన్ ఆగష్టు 31 న చైనా రిలీజ్ అవుతుంది.  దంగల్ లాగానే సుల్తాన్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.