వైఎస్ జగన్ చేతుల మీదుగా.. సుమంత్ టీజర్

వైఎస్ జగన్ చేతుల మీదుగా.. సుమంత్ టీజర్

మళ్ళిరావా సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన హీరో సుమంత్.  పది సంవత్సరాల కాలంలో రెండు మూడు హిట్స్ మాత్రమే అందుకున్న ఈ హీరోకు మళ్ళిరావా మంచి ఊరటను ఇచ్చింది.  ఇప్పుడు సుమంత్ ఇదమ్ జగత్ సినిమాలో నటిస్తున్నాడు.  అనిల్ శ్రీకాంతం దర్శకుడు.  థ్రిల్లర్ జానర్ లో సినిమా రూపొందుతుంది.  ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  కాగా, ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 21 వ తేదీన వైఎస్ జగన్ చేతుల మీదుగా విడుదల కాబోతున్నది.  జగన్, సుమంత్ లు మంచి స్నేహితులు.  ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఈ చనువుతోనే స్నేహితుడి ఇదం జగత్ టీజర్ జగన్ చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నది.