నేటినుంచి సమ్మర్ హాలీడేస్.. క్లాస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు..

నేటినుంచి సమ్మర్ హాలీడేస్.. క్లాస్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు. శుక్రవారం రోజు చివరి వర్కింగ్ డే కాగా... ఇవాళ్టి నుంచి సమ్మర్ హాలీడేస్ ఇచ్చేశారు. నేటి నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి... జూన్ 1వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయిన విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు, సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ప్రైవేట్ యాజమన్యాలు తూచా తప్పకుండా అమలుచేయాలంటున్నారు అధికారులు.