సందీప్ కిషన్ టికెట్లు కూడా అమ్ముతున్నాడు

సందీప్ కిషన్ టికెట్లు కూడా అమ్ముతున్నాడు

యువ హీరో సందీప్ కిషన్ మూడు నాలుగు రోజులుగా అనేక ఊర్లు తిరుగుతూ జనాల్ని కలిసే పనిలో ఉన్నారు.  కారణం ఇటీవల విడుదలైన తన చిత్రం 'నిను వీడనై నీడను నేనే' ప్రమోషన్లు.  యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గరచేయడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారాయన.  కాలేజీలకు వెళ్లి కుర్రాళ్లను కలుస్తున్నారు.  థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు.  గుళ్ళు తిరుగుతున్నారు.  రోడ్ల మీద సైకిల్ తొక్కుతూ జనానికి సెల్ఫీలు  ఇస్తున్నారు.  చివరికి ఈరోజు కాకినాడలోని ఒక థియేటర్లో కౌంటర్లో కూర్చుని టికెట్స్ అమ్మారు.  మొత్తానికి జనాన్ని ఆకర్షించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.