సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తున్న హీరో

సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తున్న హీరో

ఈవారం విడుదలలవుతున్న సినిమాల్లో 'మల్లేశం, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ' కూడా ఉన్నాయి.  చెప్పాలంటే ఈ రెండు సినిమాలు మీదే ఎక్కువ బజ్ ఉంది.  ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు.  హీరో సందీప్ కిషన్ సైతం ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు.  అంతేకాదు ఆ సినిమాలు విజయ్మస్ అందించాలని తనవంతు కృషి చేస్తున్నారు. మొదటిరోజుకు ఒక్కో సినిమా టికెట్లు 50 చొప్పున కొన్న ఆయన వాటిని హైదరాబాద్లోని ప్రేక్షకులకు ఉచితంగా ఇస్తున్నారు.  దీనిద్వారా సినిమాను ప్రోత్సహించినట్లవుతుందని ఆయన భావిస్తున్నారు.