మహేష్ సినిమాపై సందీప్ క్లారిటీ

మహేష్ సినిమాపై సందీప్ క్లారిటీ

'అర్జున్ రెడ్డి' హిట్ తర్వాత సందీప్ వంగ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.  అంతా సెట్టవుతోంది అనుకునే సమయానికి ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. ఆ తరవాత మహేష్ వరుసగా సినిమాలకు సైన్ చేయడం, సందీప్ 'కబీర్ సింగ్' కోసం ముంబై వెళ్లిపోవడం జరిగింది.  ఇక వీరి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని అందరూ అనుకున్నారు.  

కానీ వారి సినిమా ఉంటుందట.  ఆలస్యమైనా త్వరలోనే మొదలవుతుందట.  మహేష్ బాబుకి ఒక కథ చెప్పానని, దానిపై వర్క్ చేస్తున్నానని, సరైన సమయం రాగానే సినిమా స్టార్ట్ చేస్తామని అంటున్నారు సందీప్ వంగ.  మరి ఆ శుభ తరుణం ఎప్పుడో చూడాలి.