టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ..!? ఇదే మోడీ, షా మాట..!

టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ..!? ఇదే మోడీ, షా మాట..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా బీజేపీ పొత్తు విషయంలో చేసిన వ్యాఖ్యలతో మరోసారి తెలుగుదేశం పార్టీ-భారతీయ జనతా పార్టీ పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది.. అయితే ఆ తర్వాత ఈ రెండు పార్టీల స్నేహంపై క్లారిటీ ఇచ్చేశారు ఏపీ బీజేపీ ఇంఛార్జ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధీయోధర్.. టీడీపీతో జత కట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయని తేల్చేశారు. ఇక, ఈ వ్యవహారంపై మరోసారి వివరణ ఇచ్చారు సునీల్ ధీయోధర్.. కర్నూలు పర్యటనలో ఉన్న ఆయన.. టీడీపీ-బీజేపీ మైత్రిపై స్పందిస్తూ.. టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని.. టీడీపీకి డోర్లు మూసివేవామని.. ఇది సునీల్ ధీయోధర్ మాట కాదు.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చెప్పిన మాట అని స్పష్టం చేశారు. 

ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది.. టీడీపీ శకం ముగిసిపోయింది.. ఆ పార్టీలో ఉన్న నేతలంతా భారతీయ జనతా పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు సునీల్ ధీయోధర్.. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారాయన.. టీడీపీ అధినేత చంద్రబాబు కట్టప్పలాంటివాడు.. బీజేపీకి వెన్నుపోటు పొడిచాడని హాట్ కామెంట్లు చేశారు. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గానీ.. జనసేన పార్టీతో గానీ ఎలాంటి ఒప్పందం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సొంతంగా ఎదుగుతోందని తెలిపారు సునీల్ ధీయోధర్.