'బాబు అవినీతిపై సీబీఐ విచారణ చేయిస్తాం'

'బాబు అవినీతిపై సీబీఐ విచారణ చేయిస్తాం'

చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై జగన్ ప్రభుత్వం కేంద్రానికి ఆధారాలు ఇస్తే సీబీఐతో విచారణ చేయిస్తామని బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సునీల్‌ దేవదర్‌ స్పష్టం చేశారు. ఇవాళ రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఏపీని లూటీ చేసి చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనన్నారు. కొత్త సీఎం జగన్‌ పరిపాలనను ఏడాదిన్నరపాటు గమనిస్తామని, ఆయన విధానాన్ని గమనించి సహకరిస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రా కోడలని, ఆమె రూపంలో ఏపీలో లక్ష్మీదేవి ఉన్నట్టేనని సునీల్‌ వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి వచ్చే వారి కోసం ఏపీలో బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు.