యాంకర్‌పై పంచులేసిన సునీల్

యాంకర్‌పై పంచులేసిన సునీల్

‘అల.. వైకుంఠపురములో’ సినిమా విడుదలై ఏదాడి పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర బృందం రీయూనియన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్, నటులు సముద్రఖని, సునీల్, నవదీప్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడేందుకు నవదీప్, సునీల్‌ను యాంకర్ వేదికపైకి పిలిచారు. సునీల్ మాట్లాడుతూ ‘అల.. వైకుంఠపురములో’ సినిమా తనకు రీ లైఫ్ ఇచ్చిందని సునీల్ అన్నారు. ఈ సినిమా వల్ల ఇప్పుడు చాలా ప్రాజెక్టులు చేస్తున్నానని సునీల్ వెల్లడించారు. కాగా సునీల్ యాంకర్ పై వేసిన పంచులకు త్రివిక్రమ్, బన్నీ నవ్వుల్లో మునిగారు. ఆ ఇంట్రెస్టింగ్ వీడియోను మీరు చూసేయండి.