ధోని బాల్ ను గుర్తించడంలో సహాయం చేసిన గవాస్కర్...

ధోని బాల్ ను గుర్తించడంలో సహాయం చేసిన గవాస్కర్...

భారత మాజీ కెప్టెన్ ధోని గత నెల 15న తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.  తన క్రికెట్ కెరియర్ లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ధోని మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఆ మూడులో ఒకటైన 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ధోని ఫైనల్ సిక్స్ ను భారత అభిమానులు ఎవరు మర్చిపోలేరు. వాంఖడే స్టేడియంలో శ్రీలంక పేసర్‌ కులశేఖర వేసిన బంతిని లాంగాన్‌ మీదుగా‌ స్టాండ్స్‌లోకి ధోని కొట్టిన సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. అయితే ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) ధోని స్టాండ్స్‌లోకి కొట్టిన ఆ ఆఖరి సిక్స్ లో బంతి ఏ కుర్చీలో పడిందో ఆ కుర్చీని ధోనికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ బంతి పడిన సీటును గుర్తించడానికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నాలు చేసింది, కానీ వారు అందులో విజయవంతం కాలేదు. కానీ లెజెండరీ ఇండియా బాట్స్మెన్ సునీల్ గవాస్కర్ ఇప్పుడు ఆ బంతి ఎవరి వద్ద ఉందొ ఆ వ్యక్తి తనకు తెలుసు అని ఎంసీఏకి సమాచారం ఇచ్చాడు. ఆ వ్యక్తి టికెట్‌తో పాటు మ్యాచ్ బాల్‌ను కూడా భద్రపరిచాడు అని చెప్పాడు. దాంతో ఆ బంతి పడిన సీటును గుర్తించవచ్చని తెలిపాడు. అందువల్ల ఎంసీఏ పని ఇప్పుడు సులువైంది. అయితే ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్‌కి రెండు శాశ్వత సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.