రోహిత్ కు ఏమైందో బీసీసీఐ చెప్పాలి : గవాస్కర్

రోహిత్ కు ఏమైందో బీసీసీఐ చెప్పాలి : గవాస్కర్

కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్ 27న మొదలయ్యే ఈ టూర్ కోసం భారత జట్టు దుబాయ్ నుంచి సిడ్నీకి వెళ్లనుంది. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ‌ తొడకండరాల గాయం కారణంగా ఈ పర్యటనకు పూర్తిగా దూరమయ్యాడు. రోహిత్ శర్మకి చోటు దక్కకపోవడంపై దుమారం రేగుతోంది.

ఈ విషయం పై భారత దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్‌ సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం చేశారు. రోహిత్ గాయంపై ముంబై ఇండియన్స్, భారత సెలక్టర్లు స్పష్టమైన సమాచారం చెప్పకపోవడంపై మండిపడ్డారు. రోహిత్ శర్మ ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతనికి ఎలాంటి గాయమైందో? నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రోహిత్ ఫ్యాడ్స్‌ కట్టుకుని ప్రాక్టీస్ ఎలా చేస్తాడు. రోహిత్ శర్మకి ఏమైందనే విషయం కనీసం ఇప్పటికైనా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ అధికారులు నిజాయతీగా చెప్పాలి. గాయంపై ఓ స్పష్టత ఇవ్వాలి అని గవాస్కర్ ప్రశ్నించారు.