అనుష్క వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన గవాస్కర్...

అనుష్క వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన గవాస్కర్...

ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు కీలకమైన క్యాచ్ లను వదిలేసాడు. ఆ తర్వాత తమ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ 5 బంతులలో ఒకే పరుగు చేసి పెవిలియన్ కు చేరాడు. దాంతో ఈ మ్యాచ్ కు హిందీ కామెంట్రీ చేస్తున్న భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్.. ఆటగాడు ఎలా ప్రాక్టీస్ చేస్తాడో అలానే ఆడుతాడు. లాక్ డౌన్ లో అతను అనుష్క శర్మ బంతులతో ప్రాక్టీస్ చేసాడు అని తెలిపాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే గవాస్కర్ చేసిన వ్యాఖ్యల పై విరాట్ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా వేదిక మిస్టర్ గవాస్కర్ మీ కామెంట్ చాలా అసహ్యకరమైనది అంటూ తెలిపింది. దాంతో అనుష్క వ్యాఖ్యలకు సమాధాం ఇచ్చాడు గవాస్కర్. నేను అసహ్యకరమై కామెంట్ ఏం చేశాను. నేను సోషల్ మీడియాలో కోహ్లీ పక్కింటి వారు పోస్ట్ చేసిన వీడియోలో ఏం ఉందొ నేను అదే చెప్పను. ఆ వీడియోలో కోహ్లీ అనుష్క బౌలింగ్ ఎదుర్కొంటున్నాడు. లాక్ డౌన్ లో కోహ్లీకి ప్రాక్టీస్ లేదు. అందువల్ల అతను అనుష్క బౌలింగ్ లో ప్రాక్టీస్ చేసాడు. అందుకే ఇలా ఆడుతున్నాడు అని చెప్పను ఇందులో అసహ్యకరమైనది ఏం ఉంది అంటూ అన్నాడు. మరి ఈ వ్యాఖ్యల పై అనుష్క ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.