ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతిపై గవాస్కర్ రియాక్షన్‌...

ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతిపై గవాస్కర్ రియాక్షన్‌...

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న అతడు ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతిపై స్పందించాడు. ఇంగ్లాండ్ ఓటమికి ఆటగాళ్ల రొటేషన్‌ పద్ధతి కూడా కారణమని వివరించాడు. జట్టుకు అవసరమైన వేళ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు పనిభారం పేరిట స్వదేశానికి తిరిగి వెళ్లారని విమర్శలు గుప్పించారు. అలా వెళ్లడం వల్ల ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నారు. అయితే టీమ్‌ఇండియా సైతం చాలా కాలంగా బయో బబుల్‌లో ఉందిని.. అయినా.. ఆస్ట్రేలియా, భారత్‌లో ఎలా పోరాడిందో చూశామని చెప్పాడు. నాలుగో టెస్టులో క్లిష్ట పరిస్థితుల్లోనూ యువ బ్యాట్స్‌మెన్‌ చక్కగా ఆడారని అన్నాడు. తన అభిప్రాయం తెలిపాడు. అయితే భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 3-1 తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.