కోహ్లీ, సచిన్ పాపులారిటీని ధోని దాటేశాడు...

కోహ్లీ, సచిన్ పాపులారిటీని ధోని దాటేశాడు...

మన భారత్ లో మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలో క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఇక ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తూ నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. వీరిద్దరికి ప్రపంచవ్యాఫంగా చాలా పాపులారిటీ ఉంది. కానీ ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పాపులారిటీ విషయంలో వీరిద్దరిని దాటేశాడు అంటున్నారు భారత మాజీ లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అయితే 15 ఏళ్ళు అంతర్జాతీయ క్రికెట్ లో రాణించిన ధోని గత నెల 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్ గా రికార్డు సాధించిన ధోని వికెట్ల వెనుక ఉండి కీపర్ గా కూడా అద్భుతాలు చేసాడు. ధోని కెప్టెన్సీకి, వ్యూహ రచనకు ఫిదా కానీ వారు ఎవరు ఉండరు. అలాగే ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలో కూడా ధోనికి బాగా తెలుసు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో తన జట్టులో కీలక ఆటగాళ్లు, రైనా, హర్భజన్ లేకపోయినా మొదటి మ్యాచ్ లో జట్టుకు విజయాన్ని అందించిన ధోని పాపులారిటీ విషయంలో కోహ్లీ, సచిన్ లను దాటేశాడు అని సునీల్ గవాస్కర్ తెలిపాడు. దాదాపు ఏడాదిన్నర ఆటకు దూరంగా ఉన్న ధోనిని తక్కువ అంచనా వేస్తే ఎలా, ఇప్పటికి ధోని ఆలోచనలకు పదును తగ్గలేదు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చేసి ఆటగాళ్లను పంపాడు అని తెలిపారు.