వెడ్డింగ్ టీజర్: విడుదల చేసిన సింగర్ సునీత

వెడ్డింగ్ టీజర్: విడుదల చేసిన సింగర్ సునీత

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ సునీత, ఓ ప్రముఖ డిజిటల్‌ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి ఆమె ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాహ మహోత్సవానికి కేవలం అతికొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరైన ఘనంగా జరిగింది. కాగా, తాజాగా రామ్ తో సునీత నిశ్చితార్థం మొదలు, మెహందీ వరకు ఇంట్లో జరిగిన వేడుకలను షూట్ చేసిన వీడియోను విడుదల చేసింది సునీత. చాలా అందంగా, ఆనందంగా సాగిన ఈ వీడియోలో సునీత తన బంధు-మిత్రులతో సంతోషంగా కనిపించింది. పెళ్లికి సంబంధించిన వీడియోను కూడా త్వరలోనే విడుదల చేయనుంది సింగర్ సునీత.