స్వరూపానందను కలవలేదు: సింగర్ సునీత

స్వరూపానందను కలవలేదు: సింగర్ సునీత

ఎన్ని విమర్శలల్లొచ్చినా వాటిలో నిజంలేనప్పుడు ఏమాత్రం స్పందించకుండా వివాదాలకు దూరంగా ఉండే సెలబ్రిటీల్లో సింగర్ సునీత కూడా ఒకరు.  ఎన్నో పుకార్లను కనీసం పట్టించుకోని ఆమె తాజాగా ప్రముఖ శారదాపీఠాధిపతి స్వరూపానందసరస్వతి విషయంలో మాత్రం గట్టిగానే స్పందించారు.  ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను కలవడానికి వచ్చే సెలబిటీల జాబితాను చెప్పిన స్వరూపానంద సునీత పేరును కూడా చెప్పారు.  ఈ సంగతి తెలూసుకున్న సునీత రోజూ ఎన్నో పుకార్లను దాటుకుంటూ వస్తుంటాను, కానీ ఈ విషయంపై మాత్రం స్పందించాల్సిన వసరం ఉందని అనిపిస్తోంది అంటూ అసలు తానెప్పుడూ స్వరూపానందాసరస్వతిని కావాలేదని, అలాంటప్పుడు ఆయన తన పేరును నేషనల్ మీడియాలో ఎలా చెబుతారని అన్నారు.