స్టన్నింగ్ లేడీ డాన్

స్టన్నింగ్ లేడీ డాన్

బాలీవుడ్ లో ఇప్పుడు నెంబర్ 1 హీరోయిన్ గా వెలుగొందుతున్న కత్రినా కైఫ్ సినిమా కెరీర్ మొదట ప్రారంభమైంది టాలీవుడ్ సినిమాతోనే.  టాలీవుడ్ లో మల్లీశ్వరి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత బాలకృష్ణ అల్లరి పిడుగు సినిమాచేసిన కత్రినా.. అక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది.  

బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కత్రినా స్పెషాలిటీ.  రీసెంట్ గా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది.  ఎలి  మ్యాగజైన్ మే ఎడిషన్ కు పోజులు ఇచ్చింది. షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకోకుండా ఉన్న ఫోటో అది.  తీరిగ్గా పడకుర్చిలో కూర్చొని లేడీ డాన్ లా ఫొటోకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్ లు వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు కత్రీనాకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ.