నామినేషన్‌ వేసిన బాలీవుడ్‌ హీరో

నామినేషన్‌ వేసిన బాలీవుడ్‌ హీరో

పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తునన బాలీవుడ్‌ హీరో స‌న్నీడియోల్‌ కొద్దిసేపటి క్రితం నామినేషన్‌ వేశారు. గురుదాస్‌పూర్‌లోని ఆయన తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సన్నడియోల్‌ వెంట సోదరుడు, హీరో బాబీ డియోల్‌ ఉన్నారు. 
పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాలకుగానూ  అమృత్ సర్, గురుదాస్‌పూర్, హోషియార్ పూర్‌లో బీజేపీ పోటీ చేస్తోంది. స‌న్నీడియోల్ తండ్రి ధ‌ర్మేంద్ర కూడా  గతంలో బీజేపీ నుంచి పోటీ చేశారు.