సన్నీలియోన్ ఎంత బిజీనో చూశారా..?

సన్నీలియోన్ ఎంత బిజీనో చూశారా..?

బాలీవుడ్ లో పోటీని తట్టుకొని నిలబడటం అంటే మామూలు విషయం కాదు.  పెద్దల సినిమాలను పక్కన పెట్టి ... బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి.  అలాంటి సాహసాన్ని చేయడమే కాదు.. ఆటంకాలు ఎదురైనా.. వాటన్నింటిని తట్టుకొని నిలబడి.. విజయం సాధించింది సన్నీలియోన్.  ప్రస్తుతం బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న నటీమణుల్లో సన్నీలియోన్ కూడా ఒకరు.  

నార్త్ తో పాటు సౌత్ లోను సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. కాళ్లకు విమానాలు కట్టుకొని పరుగులు తీస్తోంది సన్నీలియోన్.  సినిమాలు చేస్తూనే సామాజికి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను దత్తత తీసుకుంది.  అలాగే, స్టార్ స్టక్ పేరుతో సౌందర్య ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ బిజీగా మారిపోయింది.  ఎంత బిజీగా ఉంది అంటే... కూర్చొని తినడానికి కూడా సమయం దొరకనంత బిజీగా మారిపోయింది.  ఫ్రెషప్ అయ్యి.. ఒక చేత్తో బౌల్ పట్టుకొని డ్రెస్సింగ్ చేసుకోవడానికి వస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో సన్నీలియోన్ పోస్ట్ చేసింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.