సన్నీ లియోన్ కిక్ కొడితే..!!

సన్నీ లియోన్ కిక్ కొడితే..!!

నార్త్, సౌత్ లలో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్స్ లో సన్నీలియోన్ కూడా ఒకరు.  పెద్దల సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కు వచ్చి.. అక్కడ స్టామినాను నిరూపించుకున్న సన్నీలియోన్ సౌత్ లో వరసగా ఆఫర్లు దక్కించుకుంటున్నది.  సౌత్ నాలుగు భాషల్లో నటిస్తున్న వీరమాదేవి సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.  మలయాళంలోను ఓ సినిమా చేస్తున్న సన్నీ.. స్టార్ స్టక్ సౌందర్య ఉత్పత్తులను ప్రారంభించి సొంతంగా ప్రచారం కూడా చేసుకుంటున్నది.  

35 సంవత్సరాల వయసులో కూడా సన్నీలియోన్ తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ.. నిత్యం వ్యాయామం.. యోగ వంటివి చేస్తున్నది.  సన్నీలియోన్ మంచి కిక్ బాక్సర్ కూడా.  జిమ్ లో కరాటే కిక్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది.