అందాల కొమ్మ.. బంగారు బొమ్మ...

అందాల కొమ్మ.. బంగారు బొమ్మ...

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తారల్లో సన్నీలియోన్ కూడా ఒకరు.  పెద్దల సినిమాల నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టడం అన్నది ఒక సాహసం అని చెప్పాలి.  సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసి.. అనేక సినిమాల్లో నటించిన హీరోయిన్ గా గుర్తింపు పొందిన సన్నీలియోన్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమాల్లో కూడా వరసగా నటిస్తూ బిజీ అయ్యింది.  

సినిమాలతో పాటు తన సొంత ప్రొడక్ట్స్ స్టార్ స్టక్ ను ప్రచారం చేస్తున్నది.  నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోను అప్లోడ్ చేసి అభిమానులకు దగ్గరైన సన్నీ, రీసెంట్ గా ఓ ఫోటోను షేర్ చేసింది.  గోల్డ్ కలర్ లో ఉండే డ్రెస్ లో సన్నీలియోన్ బంగారు బొమ్మలా మెరిసిపోయింది.  ఆ ఫోటోను చూస్తే.. సన్నీలియోన్ ఇంత అందంగా ఉన్నదా... అసలు చూస్తున్నది సన్నీలియోన్ ఫోటోనా కాదా అనిపిస్తుంది.  ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.