ప్రేమ గురించి సన్నీలియోన్ ఏం చెప్పిందో తెలుసా?

ప్రేమ గురించి సన్నీలియోన్ ఏం చెప్పిందో తెలుసా?

ప్రేమ ఎప్పుడు కూడా చాలా కొత్తగా ఉంటుంది.  ఆ కొత్తదనం ఏంటి అన్నది మాత్రం అందులో ఉన్న వ్యక్తులకు మాత్రమే అర్ధం అవుతుంది తప్పించి మరొకరికి అర్ధం కాదు.  ప్రేమించడం గొప్ప విషయం.  ప్రేమించబడటం ఇంకా గొప్ప విషయం.  అందుకే ప్రేమించే వ్యక్తులు దొరికినపుడు చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు.  

ఈ విషయంలో తాను చాలా లక్కీ అని అంటోంది నటి సన్నీలియోన్.  పెద్దల సినిమాల్లో నటించే సమయంలోనే ఈమె వెబర్ ను ప్రేమించింది.  అప్పటి నుంచి వెబర్ కూడా సన్నీలియోన్ ను ప్రేమించారు.  ఇద్దరు ఆ సినిమాల నుంచి బయటకు వచ్చి 2009లో వివాహం చేసుకున్నారు.  పెళ్లి చేసుకొని పదేళ్లు పూర్తయింది.  ఇప్పటికి వారు చాలా హ్యాపీగా ఉంటున్నారట.  ప్రస్తుతం సన్నీలియోన్ బాలీవుడ్ సినిమా రంగంలో బిజీ అయ్యింది.  సినిమాలు చేస్తూనే బిజినెస్ లో బిజీ అయ్యింది.  ప్రేమంటే చాలా సింపుల్ అని అంటోన్న సన్నీలియోన్ దానికి అర్ధం చెప్పింది.  అదేమంటే, అందమైన భార్య, సంతోషకరమైన జీవితం ఇవే ప్రేమకు నిదర్శనం అని.  సింపుల్ గా ఉన్న పర్ఫెక్ట్ గా ఉన్నది కదా.