కరోనా వైరస్ పై సన్నీ ప్రచారం... షాకైన అభిమానులు... 

కరోనా వైరస్ పై సన్నీ ప్రచారం... షాకైన అభిమానులు... 

కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో చెప్పక్కర్లేదు.  కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే 170 మంది మరణించారు.  ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తున్నారు.  సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే దీనిపై ప్రచారం జరుగుతున్నది. సెలెబ్రిటీలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రచారం కల్పిస్తున్నారు.  వీరిలో సన్నీలియోన్ కూడా ఒకరు.  

ఇటీవలే విహారయాత్ర ముగించుకొని ముంబై ఎయిర్ పోర్ట్ కు వచ్చింది.  అలా వచ్చిన సన్నీలియోన్ తో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ సిద్ధం అయ్యారు.  కానీ, సన్నీ అందుకు అనుమతించలేదు.  కారణం ఏంటి అంటే కరోనా వైరస్.  వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు మనకు ఎయిర్ పోర్ట్ లో ఎక్కువగా కనిపిస్తుంటారు.  అలా వచ్చిన వ్యక్తులలో ఎవరికీ ఎలాంటి వైరస్ ఉన్నదో చెప్పడం కష్టం కాబట్టి ఈ వైరస్ నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా అందరికి అవగాహనా ఉండాలి.  ఇప్పుడు సెల్ఫీ ముఖ్యం కాదని, చుట్టుపక్కల ఏం జరుగుతుందో అవగాహన చేసుకోవాలి అని చెప్పి ఫ్యాన్స్ కు హితబోధ చేసింది.  ముక్కుకు మాస్క్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సన్నీ.  సన్నీతో సెల్ఫీ దిగాలి అనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది.