మమ్మూట్టి సినిమాలో సన్నీలియోన్..!!

మమ్మూట్టి సినిమాలో సన్నీలియోన్..!!

సౌత్ లో మమ్మూట్టి గ్రేట్ యాక్టర్.  అందులో  సందేహం లేదు.  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మమ్మూట్టి కనిపించాడు.  తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.  ప్రస్తుతం తెలుగులో వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న యాత్ర సినిమాలో వైఎస్ఆర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఫిబ్రవరి 8 న రిలీజ్ కాబోతున్నది.  

అటు మలయాళంలో కూడా మమ్మూట్టి మధుర రాజా అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నిలియోన్ ఓ రోల్ ప్లే చేస్తున్నది.  మమ్మూట్టి, సన్నిలియోన్ షూట్ స్పాట్ కు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. మమ్మోట్టి ట్రెడిషన్ గా ఉంటె, సన్నీలియోన్ గోల్డ్ కలర్ డ్రెస్ లో అల్ట్రా మోడ్రన్ గా ఉంది. మమ్మూట్టి సినిమాలో చేస్తూనే.. మరోవైపు సోలో హీరోయిన్ గా మలయాళంలోకి రంగీలాగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది సన్నీలియోన్.