సన్నీలియోన్ వీరమాదేవి షూటింగ్ అప్డేట్స్

సన్నీలియోన్ వీరమాదేవి షూటింగ్ అప్డేట్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ ప్రస్తుతం పలు హిందీ, మలయాళం ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. ఈ ప్రాజెక్ట్స్ తో పాటు సన్నీ లియోన్ సౌత్ లో వీరమాదేవి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభమైంది.  

సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ చివరి నుంచి ప్రారంభం కాబోతున్నది.  వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసి దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.