కోచ్‌ కన్నీరు... కెప్టెన్ భావోద్వేగం...

కోచ్‌ కన్నీరు... కెప్టెన్ భావోద్వేగం...

ఎలాగైనే ఐపీఎల్ 2019 కప్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు కోచ్, కెప్టెన్... అందుకోసం టీమ్ అంతా ఎంతో కృషి చేసింది.. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు పెద్ద టార్గెటే పెట్టింది. కానీ, రిషభ్‌ పంత్.. వారి కలలకు గంటి కొట్టాడి. దీంతో కళ్లముందే మ్యాచ్‌ చేజారిపోతుంటే.. ఓవైపు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టుకుంటే.. మరోవైపు గ్రౌండ్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీ జట్టు గెలవాలంటే 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన సమయంలో సన్‌ రైజర్స్‌దే విజయం అని అంతా అంచనా వేశారు.. ఇదే సమయంలో థంపీ వేసిన 18వ ఓవర్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు. ఆ ఓవర్‌ ముగిసిన తర్వాత సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారింది. దీంతో మ్యాచ్‌ ఢిల్లీవైపు మళ్లీంది. రిషభ్‌ పంత్‌ చెలరేగడంతో మరో బంతి మిగిలి ఉండగానే ఢిల్లీ విజయం సాధించింది. మరోవైపు ఐపీఎల్ 2019 టోర్నీ నుంచి సన్‌ రైజర్స్‌ నిష్క్రమించకతప్పని పరిస్థితితి. ఇదే సమయంలో  ఓవైపు కోచ్‌ టామ్‌ మూడీ, కెప్టెన్ విలియమ్సన్ భావోద్వేగానికి గురికావడంపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందించారు.