కీలక మ్యాచ్‌లో హైదరాబాద్‌ విక్టరీ..

కీలక మ్యాచ్‌లో హైదరాబాద్‌ విక్టరీ..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విక్టరీ కొట్టింది... కీలక మ్యాచ్‌లో కోహ్లీసేనపై 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పడికల్ , తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ఈ దశలో ఓపెనర్ ఫిలిప్‌తో కలిసిన  డివిలీయర్స్.. ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత ఫిలిప్ 32, డివిలీయర్స్ 24 పరుగులు చేసి.. వెంటవెంటనే  ఔట్ అయ్యారు. దీంతో బెంగళూరు స్కోర్కు బ్రేక్ పడింది. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్ రెండు వికెట్లు తీశారు.

స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు.. 14.1 ఓవర్లలోనే మరో ఐదు వికెట్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత  మనీష్ పాండే 26 రన్స్‌తో రాణించాడు. ఆ తర్వాత హోల్డర్ 10 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్లతో 26 రన్స్ చేసి హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ టీమ్ నాల్గవ స్థానానికి చేరుకుంది.  ఈ టోర్నీలో సన్ రైజర్స్ జట్టుకు ఇదీ ఆరో విజయం. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో.. వార్నర్‌ సేన గెలిస్తే ప్లేఆఫ్‌ బెర్తుకు ఢోకా ఉండదు.