ఐపీఎల్ లో హైదరాబాద్ బౌలర్ కొత్త రికార్డు... 

ఐపీఎల్ లో హైదరాబాద్ బౌలర్ కొత్త రికార్డు... 

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ కొత్త రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సందీప్ నిలిచాడు. అయితే ఈ రోజు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు వరకు సందీప్ శర్మ పవర్ ప్లే లో 51 వికెట్లు తీసాడు. కానీ ఈ మ్యాచ్ లో అతను వేసిన మూడో ఓవర్లో ముంబై కెప్టెన్, ఓపెనర్ అయిన రోహిత్ శర్మ(4) ను వెనక్కి పంపాడు. ఆ తరవాత 5 ఓవర్లో మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (25) ను కూడా పెవిలియన్ కు చేర్చాడు. దాంతో పవర్ ప్లే లో అత్యధికంగా 53 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు . ఇంతక ముందు ఈ రికార్డ్ జహీర్ ఖాన్ (52) పేరిట ఉండేది. కానీ ఇప్పుడు సందీప్ శర్మ మొదటి స్థానంలోకి రావడంతో జహీర్ రెండో స్థానానికి వెళ్ళిపోయాడు. వీరి తర్వాత మరో హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (48) వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే సందీప్ శర్మ పేరిట ఐపీఎల్ లో మరో రికార్డు కూడా ఉంది. ఏంటంటే... ఐపీఎల్ లో అత్యధికంగా విరాట్ కోహ్లీని 7 సార్లు, రోహిత్ శర్మను 4 సార్లు ఔట్ చేసిన ఘనత కూడా సందీప్ పేరు మీద ఉంది. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో మొత్తం 89 మ్యాచ్ లు ఆడిన సందీప్ 105 వికెట్లు పడగొట్టాడు.