సన్రైజర్స్ ఆటగాడు రషీద్ ఖాన్ ఇంట విషాదం...
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అఫ్గానిస్తాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తన తల్లి ఆరోగ్యం బాగాలేదు ఆమె కోసం ప్రార్ధనలు చేయండి అంటూ అభిమానులను ట్విట్టర్ వేదికగా కోరిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఆనారోగ్యంతో బాధపడుతున్న రషీద్ ఖాన్ తల్లి గురువారం మరణించారు. ఈ వార్తను తన అభిమానులతో పంచుకుంటూ రషీద్ ఎమోషనల్ ట్విట్ చేసాడు. అందులో... ''మీరు నాతో లేరని నేను నమ్మలేను, నేను మిమల్ని చాలా మిస్సవుతానమ్మా. నీ ఆత్మకు శాంతికలగాలి'' అని పోస్ట్ చేసాడు. అయితే రషీద్ తల్లి మరణవార్త తెలుసుకున్న పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)