ఐపీఎల్ 2020 : బెంగళూరును కట్టడి చేసిన సన్‌రైజర్స్...

ఐపీఎల్ 2020 : బెంగళూరును కట్టడి చేసిన సన్‌రైజర్స్...

ఈ రోజు ఐపీఎల్ 2020 లో ఎలిమినేటర్ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే బెంగళూరు కు హైదరాబాద్ బౌలర్ హోల్డర్ మొదట్లోనే షాక్ ఇచ్చాడు. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లీ(6), దేవదత్ (1) ని వెంట వెంట ఓవర్లలోనే పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత ఆరోన్ ఫించ్(32), ఎబి డివిలియర్స్ (56) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. కానీ తర్వాత వచ్చిన వారిలో ఎవరు రాణించకపోవడంతో మళ్ళీ ఆర్సీబీ స్కోర్ బోర్డు నెమ్మదించింది. చివరి వరకు సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు, టి నటరాజ 2, షాబాజ్ నదీమ్ ఒక వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి క్వాలిఫైర్ 2 కి సన్‌రైజర్స్ చేరాలంటే 132 పరుగులు చేయాలి. గత రెండు మ్యాచ్ లలోను రాణించిన ఆ జట్టు కెప్టెన్ వార్నర్ మరోసారి రెచ్చిపోతే సునాయాసంగా విజయం సాధించవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.