హైదరాబాద్ టార్గెట్ 133 రన్స్

హైదరాబాద్ టార్గెట్ 133 రన్స్

ఐపీఎల్ 2019లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందు 133 టార్గెట్‌ను పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్.. గాయం కారణంగా కెప్టెన్ ధోనీ మ్యాచ్‌కు దూరం కావడంతో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సురేష్ రైనా మొదట బ్యాటింగ్‌కు దిగారు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన చెన్నై 132 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్‌ 45, వాట్సన్‌ 31 శుభారంభం చేసినా.. భారీ స్కోరు చేయలేకపోయింది చెన్నై జట్టు. అంబటి రాయుడు 25 పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. సురేష్‌ రైనా 13, రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో చెన్నై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగుల చేసింది. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో రషీద్‌ఖాన్‌ రెండు వికెట్లు తీయగా... విజయ్‌శంకర్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.