ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్ ను కట్టడి చేసిన సన్ రైజర్స్...

ఐపీఎల్ 2020 : ముంబై ఇండియన్స్ ను కట్టడి చేసిన సన్ రైజర్స్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. అయితే హైదరాబాద్ బౌలర్లు ముంబైని బాగానే కట్టడి చేసారు. కెప్టెన్ రోహిత్ శర్మ(4) పరుగులకే పెవిలియన్ కు చేరుకోగా తర్వాత క్వింటన్ డి కాక్ (25), సూర్యకుమార్ యాదవ్(36), ఇషాన్ కిషన్ (33) ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. కానీ తర్వాత వచ్చిన వారిలో పోలార్డ్ మినహాయించి ఎవరు రెండంకెల పరుగులు సాధించలేదు. కానీ పోలార్డ్ చివర్లో 25 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 3 వికెట్లు, జాసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్ రెండేసి వికెట్లు అలాగే రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే సన్ రైజర్స్ 150 పరుగులు సాధించాలి. ఐపీఎల్ 2020 మొదట్లో ఈ లక్ష్యానే చేధించలేక హైదరాబాద్ జట్టు చాలా మ్యాచ్ లు ఓడిపోయింది. కానీ ఇప్పుడు రెండు వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది. మరి ఈ మ్యాచ్ లో ముంబై పై విజయం సాధిస్తారా... లేదా అనేది చూడాలి.