ఐపీఎల్ 2021 : హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే...?

ఐపీఎల్ 2021 : హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే...?

ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న హైదరాబాద్ బెంగళూరును బాగానే కట్టడి చేసింది. మ్యాచ్ మొదటి నుండే వారిని ఏ క్షణము పెద్ద స్కోర్ వైపుకు వెళ్లనివ్వలేదు. అయితే ఈ ఏడాది వేలంలో ఆ జట్టు తీసుకున్న ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(59) తో రాణించాడు. అలాగే ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ(33)తో అతనికి తోడుగా నిలవడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక  సన్‌రైజర్స్ జట్టులో హోల్డర్ 3 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, షాబాజ్ నదీమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే హైదరాబాద్ 150 పరుగులు చేయాలి. కానీ గత సీజన్లో ఇదే లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మూడు మ్యాచ్ లలో చేధించలేక ఓడిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.